contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

స్వామి విద్యానికేతన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ 132వ జయంతి ఘనంగా

విశాఖపట్నం : సాయిరాం నగర్ గాజువాక 67వ వార్డు విశాఖపట్నం లో గల స్వామి విద్యానికేతన్ హై స్కూల్ ఆవరణంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా విశాఖపట్నం ప్రభుత్వ ప్రాంతీయ వైద్యాధికారిణి డాక్టర్ హేమలత గారు మరియు జై భీమ్ నాయకులు శ్రీ భీమ్రామ్ గారు హాజరైనట్లు స్కూల్ ప్రిన్సిపల్ డాక్టర్ పాలూరు లక్ష్మణస్వామి తెలిపారు. స్కౌట్స్ నాయకులు డాక్టర్ లక్ష్మణ స్వామి గారు మాట్లాడుతూ అంబేద్కర్ గారు ప్రముఖ భారతీయ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్త, అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేసిన వ్యక్తి, స్వతంత్ర్య భారతదేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రి, రాజ్యాంగ శిల్పి అని అన్నారు. జై భీమ్ నాయకులు మాట్లాడుతూ…
డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ పుారి గుడిసెల్లో సుార్యడు పుట్టిన రోజు
వాడబతుకుల్లో వెన్నెల విరబూసిన రోజు
జ్ఞాన రాశి లో జ్యోతి ప్రజ్వరిల్లిన రోజు
నడిచే గ్రంథాలయం మనిషిగా అవతరించిన రోజు
బుద్దుడు మళ్ళీ జన్మించిన రోజు
భుాసురోత్తములు నిషేదించిన జ్ఞానఫలం తిన్న ఒకానొక శిశువు ప్రభవించిన రోజు
కుల రోగులకు చికిత్స చేసే శస్త్రకారుడు ఉదయించిన రోజు
మూతికి ముంతలు,మెులకు తాటాకులు అలవోకగా తెంచిన విలుకాడు పుట్టిన రోజు
అద్రుష్టవశాత్తు ఆకాశంలో తోకచుక్క పొడవని రోజు
చెడగొట్టబడ్డ జాతి లో కడగొట్టు బిడ్డ పుట్టిన రోజు
కడగొట్టు బానిసలను తొడగొట్టు వీరులను మార్చి పారేసిన మెునగాడు పుట్టిన రోజు
మేకలకు కేకలు నేర్పిన మగదీరుడు జయించిన రోజు
లేళ్ళకు జూలు మెులిపించిన సింహం పుట్టిన రోజు
సమరం ఉదయించిన రోజు
సమదర్మం జయించిన రోజు మన అంబేడ్కరుని పుట్టిన రోజు అని భీమ్రామ్ గారు అన్నారు. డాక్టర్ హేమలత గారు మాట్లాడుతూ అంబేద్కర్ గారు
భారత భాగ్య విధాత,భారత రాజ్యాంగ నిర్మాత,సంఘ సంస్కర్త,మహిళల,బడుగు బలహీన వెనుకబడిన వర్గాల ఆరాధ్య నేత,జ్ఞాన జ్యోతి,విశ్వరత్న శ్రీ Dr.B.R.అంబేడ్కర్ నవ భారత రాజ్యాంగ నిర్మాత, పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, బహుజన ప్రజల దిక్సూచి,ప్రపంచ మేధావి భారతరత్న బాబాసాహెబ్ *డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్వామి విద్యానికేతన్ స్కూల్ కరస్పాండెంట్ శ్రీమతి పాలూరు దేవి గారు మాట్లాడుతూ… నీ కోసం జీవిస్తే నీలోనే నిలిచిపోతావు…అదే జనం కోసం జీవిస్తే జనంలో నిలిచిపోతావు…బి ఆర్ అంబేద్కర్ గారు అన్నట్లు మరియు ఈయన పీడిత వర్గాల ఆశాజ్యోతి,న్యాయ శాస్త్ర కోయుదుడు, నవ భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క 132వ జయంతి వేడుకలకు విచ్చేసిన పెద్దలకు ఉపాధ్యాయులకు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులకు ప్రభుత్వ ప్రాంతీయ వైద్యాధికారిని చేతుల మీదుగా స్వీట్స్ పంచి పెట్టినట్లు స్కూల్ కరస్పాండెంట్ శ్రీమతి పి దేవి తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :