సంగారెడ్డి , అమీన్ పూర్: పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని ప్రతి కాలనీకి మంచినీటిని అందించేందుకు కృషి చేస్తున్నామని మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి తెలిపారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో హెచ్ఎమ్డబ్ల్యూఎస్ అధికారులు, సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిర్దేశించిన విధంగా ప్రతి కాలనీకి మంచి నీటిని విడుదల చేయాలని సూచించారు. మున్సిపల్ పరిధిలో ఐదు భారీ రిజర్వాయర్లు నిర్మించి, ప్రజలకు అందుబాటులోకి తీసుకుని రావడం జరిగిందని తెలిపారు. నూతన కాలనీలకు సైతం మంచినీటిని అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. అనంతరం స్వచ్ఛ సర్వేక్షన్ కార్యక్రమం పై సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జ్యోతి రెడ్డి, Ro వెంకట్రామయ్య, హెచ్ఎండబ్ల్యూఎస్ GM నారాయణ, AE అమిరుద్దీన్, తదితరులు పాల్గొన్నారు.