సంగారెడ్డి , అమీన్ పూర్ : పట్టణ ప్రాంతాలలో పరిశుభ్రత పచ్చదనం పెంపొందించడంతో పాటు ప్రజల జీవన ప్రమాణాలను పెంచేందుకు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించిందని అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి అన్నారు. సోమవారం మున్సిపల్ కార్యాలయం ఆవరణలో స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా వ్యర్థాల తొలగింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ పరిధిలోని ప్రతి కాలనీలో వివిధ కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు. పచ్చదనం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జాయింట్ డైరెక్టర కె . నారాయణరావు, మున్సిపల్ కమిషనర్ జ్యోతి రెడ్డి, కౌన్సిలర్ కృష్ణ, కొల్లూరు చంద్రకళ గోపాల్, మంజుల ప్రమోద్ రెడ్డి, కో ఆప్షన్ సభ్యులు తలారి రాములు, సీనియర్ నాయకులు కొల్లూరు యాదగిరి తదితరులు పాల్గొన్నారు.