సంగారెడ్డి / అమీన్ పూర్ : మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధికి చిరునామగా నిలుపుతున్నామని మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి అన్నారు. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని.. మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం మున్సిపల్ పరిధిలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కాలనీలలో ఏర్పాటు చేసిన జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎందరో మహనీయుల త్యాగఫలమే నేటి స్వాతంత్ర దినోత్సవమని అన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత పాటిస్తూ ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని తెలిపారు.
హాజరైన మున్సిపల్ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, కమిషనర్ జ్యోతి రెడ్డి, కౌన్సిలర్ కృష్ణ,కల్పన ఉపేందర్ రెడ్డి, మంజుల ప్రమోద్ రెడ్డి, కొల్లూరు మల్లేష్, కోఆప్షన్ సభ్యులు తల్లారి రాములు, యునూస్, సీనియర్ నాయకులు దాస్ యాదవ్, గాలి గిరి ,తుమ్మల ప్రభాకర్ రెడ్డి, తుమ్మల ప్రతాప్ రెడ్డి,కొల్లూరి యాదగిరి, మాకం మల్లేష్ శివరామరాజు, హరినాథ్ రెడ్డి, జ్ఞానేశ్వర్, చౌటకూరి మహిపాల్ రెడ్డి, తల్లారి యాదగిరి, యువ నాయకులు తుమ్మల రుశ్వంత్ రెడ్డి, పట్టణ పుర ప్రముఖులు, తదితరులు పాల్గొన్నారు.