సంగారెడ్డి : అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నూతన దేవాలయాల నిర్మాణాలకు సంపూర్ణ సహకారం అందిస్తున్నామని మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి తెలిపారు. మున్సిపల్ పరిధిలోని నరేంద్ర నగర్ కాలనీలో ఆదివారం నిర్వహించిన శ్రీ హనుమాన్ లక్ష్మణ సహిత సీతారాముల విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నూతన దేవాలయాల నిర్మాణాల ద్వారా ప్రతి ఒక్కరిలో దైవచింతన పెరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, సీనియర్ నాయకులు, కాలనీవాసులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
