అంగారెడ్డి / అమీన్ పూర్ : అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని కెఎస్ఆర్ కాలనీలో నూతనంగా నిర్మించిన వినాయక విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి ఒక్కరు దైవ చింతనను అలవర్చుకోవాలని కోరారు. దేవాలయాల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగా రెడ్డి అన్నారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ దేవాలయాల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నీలం మధు, కౌన్సిలర్ కృష్ణ, సీనియర్ నాయకులు తులసీ రెడ్డి, సత్యనారాయణ గౌడ్, జ్ఞానేశ్వర్, బిక్షపతి , కార్యకర్తలు పాల్గొన్నారు.