అమెరికాలో ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ చిన్నాన్న కుటుంబం దుర్మరణం పాలయ్యింది. అమెరికాలోని టెక్సాస్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. మృతులు ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ చిన్నాన్న నాగేశ్వరరావు కుటుంబంగా గుర్తించారు. రోడ్డు ప్రమాదంలో పొన్నాడ నాగేశ్వరరావు, భార్య సీతామహాలక్ష్మి, కుమార్తె నవీన గంగ, మనవడు, మనవరాలు
మృతి చెందగా.. ఆయన అల్లుడు లోకేశ్ కు తీవ్రగాయాలయ్యాయి.
