Andhrapradesh: గత వైసీపీ ప్రభుత్వం చేసిన పాపాల వల్ల రాష్ట్రంలో పెద్ద ఎత్తున భూ సమస్యలు ఉత్పన్నమయ్యాయని మంత్రి అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు. రెవెన్యూ సదస్సులకు వస్తున్న వినతులే దీనికి ఉదాహరణ అని చెప్పారు. భూ సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 1.8 లక్షల అర్జీలు వచ్చాయని తెలిపారు. 13 వేల ఫిర్యాదులకు అక్కడికక్కడే పరిష్కారాలు చూపామని చెప్పారు. రెవెన్యూ సదస్సులకు ఇప్పటి వరకు 6 లక్షల మంది హాజరయ్యారని తెలిపారు. ఆర్వోఆర్ లో తప్పులపై లక్షకు పైగా ఫిర్యాదులు వచ్చాయని వెల్లడించారు. భూ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని తెలిపారు.