అనకాపల్లి జిల్లా,గొలుగొండ మండలం పరిధిలో గల జోగుంపేటలో గ్రామ వాలంటీర్ చెట్ల శివప్రసాద్ ఒంటరిగా నివసిస్తున్న వివాహితను పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేసాడు,దింతో పెళ్లి చేసుకోమని ఆమె కోరగా చేసుకోనని తిరస్కరించడంతో గొలుగొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.తను పెళ్లి చేసుకోకపోతే తనకు చావు తప్ప వేరే మార్గం లేదని ఆమె విలేకరులకు తెలిపింది. దీనిపై పోలీస్ లు తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసింది.
