- అనంతగిరిలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పర్యటన
- సమస్యలను విన్నవించిన ఎంపీపీ శెట్టి నీలవేణి
అల్లూరి జిల్లా ( ది రిపోర్టర్) : అనంతగిరి మండల కేంద్రంలో బుధవారం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పర్యటించారు.ముందుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించి అమలవుతున్న వైద్య తీరును పరిశీలించారు. ఆప్తమాలసిస్ట్ లక్ష్మి విధులకు సక్రమంగా హాజరు కావడంలేదని గుర్తించి ఆమెను సరెండర్ చేశారు.అనంతరం టూరిజం ఆధీనంలో ఉన్న పాత రెస్టారెంట్ భవనాన్ని ఆవరణను పరిశీలించారు. రెవెన్యూ కు చెందిన స్థలంలో ఆర్ అండ్ బి అతిథిగృహం ఉండేదని ఆర్ అండ్ బి నుంచి ఏపీ టీడీసీకి లీజు ప్రాతిపదికన అప్పగించినట్లు డిప్యూటీ తహసిల్దార్ లత్సాపాత్రుడు జిల్లా కలెక్టర్ కు వివరించారు. దానిపై పూర్తి వివరాలను అందజేయాలని జిల్లా కలెక్టర్ సమిత్ కుమార్ ఆదేశించారు. అనంతగిరి పర్యటన వచ్చిన జిల్లా కలెక్టర్ కు పలు సమస్యలను వివరించారు ఎంపీపీ శెట్టి నీలవేణి పీహెచ్సీలలో ప్రతినెల గర్భిణీలకు వైద్య పరీక్షలు చేపడుతున్న సమయంలో భోజన వసతి కల్పించాలని కోరారు. అయితే అందుకు నిధులు కేటాయించలేదని విషయాన్ని గమనించి గర్భిణీలు ఆసుపత్రికి వచ్చే సమయంలో ముందస్తుగా భోజనాన్ని తీసుకొని వచ్చే విధంగా ఉండాలని సూచించారు. మండలంలో గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనుల సమాచారం తమకు తెలియజేయడం లేదని ఎంపీపీ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్లారు. అందుకు ఆయన స్పందిస్తూ ప్రభుత్వ శాఖల మానిటరింగ్ చేసే అధికారం మీకు ఉందని తదనుగుణంగా చర్యలు చేపట్టాలని ఆమెకు సూచించారు.త్వరలోనే జరుగుతున్న పనుల వివరాలను అందజేస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు.
మండలంలోని డెక్కాపూరం బోనూరు, శంకుపర్తి వంటి రహదారుల నిర్మాణాలను వేగవంతం చేయాలని ఎంపీపీ నీలవేణి, జెడ్పిటిసి దిసరి గంగరాజులు జిల్లా కలెక్టర్ ను కోరారు.
టోల్ గేట్ పై అపోహలు వద్దు:
జాతీయ రహదారి 516 A నిర్మాణంలో భాగంగా కాశీపట్టణంలో టోల్గేట్ నిర్మాణం జరుగుతుందని స్థానిక వాహనాలకు టోల్డ్ నుంచి మినహాయింపు ఇవ్వాలని ఎంపీపీ జిల్లా కలెక్టర్ను కోరారు. అందుకు ఆయన స్పందిస్తూ స్థానిక ఉద్యోగులు, గిరిజనులు ,ఆర్టీసీ బస్సులకు టోల్ నుంచి మినహాయింపు ఉంటుందని స్థానిక వాహనాలకు ప్రత్యేక రహదారిని ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. జాతీయ రహదారిలో ప్రయాణించే భారీ వాహనాలకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలకు మాత్రమే టోల్ వసూలు చేయడం జరుగుతుందని తద్వారా వచ్చిన ఆదాయాన్ని జిల్లా పరిధిలోని అన్ని మండలాలలో అభివృద్ధి పనులకు కేటాయిస్తామని ఆయన వివరించారు. ఇటీవల పంచాయతీ కార్యదర్శుల డిప్టేషన్ కొనసాగుతాయని వారికి మండలంలో అదనపు బాధ్యతలను అప్పగించేందుకు మండల పరిషత్ లో నిర్ణయం తీసుకోవచ్చునని ఆయన వెల్లడించారు.ఈ కార్యక్రమంలో తహసిల్దార్ రాంబాయి, ఆర్ఐ మల్లన్న ,లక్ష్మీకాంత్ ,డాక్టర్ జ్ఞానేశ్వరి కో ఆప్షన్ సభ్యుడు షేక్ మదీనా తదితరులు పాల్గొన్నారు.