- సమాధానం చెప్పలేక మౌనంగా ఉన్న ఎమ్మెల్యే
అల్లూరి జిల్లా హుకుంపేట:హుకుంపేట తహశీల్దార్ కార్యాలయం ప్రారంభానికి వచ్చిన,అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్,లను దీక్షలు చేస్తున్న అంగన్వాడీలు అడ్డగించి తమ సమస్యలు పరిస్కారం చేయాలని డిమాండ్ చేశారు.
సీఎం జగన్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలనీ డిమాండ్ చేశారు,తెలంగాణా రాష్ట్రం కన్నా ఒక వెయ్యి ఎక్కువ ఇస్తామని హామీ ఇచ్చిన సీఎం అధికారంలోకి వచ్చిన తరువాత అంగన్వాడీ ల సమస్యలు పరిస్కారం చేయడం లో విఫలం చెందారని పేర్కొన్నారు,కనీస వేతనం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 26 వేలు ఇవ్వాలన్నారు, గ్రాట్యుటీ అమలు చేయాలనీ,మినీ సెంటర్ లను మెయిన్ సెంటర్ లుగా మార్చాలని, రిటైర్మెంట్ బెనిఫిట్ రూ 5 లక్షలు ఇవ్వాలని, డ్యూటీలో ఉండి మరణించిన కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని, ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
తెలంగాణాలో అంగన్వాడీ లకు నెలకు రూ 13600 ఇస్తున్నారని,త్వరలో రూ 18 వేలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో, ఇచ్చినా హామీ నిలబెట్టుకోవలన్నారు. సమస్యలు పరిస్కారం చేయకుంటే పోరాటం ఉదృతం చేస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో హుకుంపేట సీఐటీయూ నాయకులు, వైస్ ఎంపీపీ సూడిపల్లి కొండలరావు, సీఐటీయూ అంగన్వాడీ నాయకులు టీ అప్పల కొండమ్మ,టీ కృష్ణవేణి, భాగ్య,వసంత,రాధిక,కృష్ణ కుమారి,విజేత, లక్ష్మీ వందలాది గా అంగన్వాడీ టీచర్స్, వర్కర్స్ తదితరులు పాల్గొన్నారు.