contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

Anjireddy Nursing College: నర్సింగ్‌ విద్యార్థిని ఆత్మహత్య యత్నం .. పరిస్థితి విషమం

పల్నాడు జిల్లా నరసరావుపేట: రాజుపాలెం మండలం కొండమోడు అంజిరెడ్డి నర్సింగ్ కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం యత్నించింది. కేరళ రాష్ట్రానికి చెందిన విస్మయ్  నర్సింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. విస్మయ్ పై కొందరు విద్యార్థులు దొంగతనం చేసిందని నెపం వేసి మానసికంగా వేదనకు గురిచేశారని అంతేకాక ఉపాధ్యాయులకు ఫిర్యాదు ఫిర్యాదు చేయడంతో ఉపాధ్యాయులు గట్టిగ మందలించడంతో మనస్తాపానికి గురై భవనం పై దూకి హాత్మహత్య కు పాలుపడినట్లు తెలుస్తుంది. విస్మయ్ ని హుటాహుటిన పిడుగురాళ్ళ అంజిరెడ్డి హాస్పిటల్ కి తరలించి, పరిస్థితి విషమించడంతో నరసరావుపేట హాస్పిటల్ కి తరలించినట్టు సమాచారం. విస్మయ్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. పోలీసువారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటన పై ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. గతంలో కూడా అంజిరెడ్డి కళాశాలల పై పలు ఆరోపణలు ఉన్నాయి. పోలీసువారి దర్యప్తు ఏ దిశలో కొనసాగనుందో వేచి చూడాలి.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :