అనకాపల్లి లోని పరవాడ ఫార్మాసిటీ లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం తెల్లవారుజామున మెట్రో కెమ్ ఫార్మా కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అందులో ఉన్న కార్మికులు భయాందోళనకు గురయ్యారు. ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేస్తున్నారు. ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.