పల్నాడు జిల్లా, మాచర్ల : పట్టణ పరిధిలో ఆకలితో అలమటించే నిరుపేదలకు కడుపునిండా పట్టణం పెట్టేందుకు అన్నా క్యాంటీన్లను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేశారని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని ఆర్ అండ్ బి కార్యాలయం సమీపంలో ఉన్న అన్న క్యాంటీన్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభించేందుకు తెలుగుదేశం పార్టీ చర్యలు తీసుకుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభం అయ్యేందుకు కొంత సమయం పడుతున్నందున అంతవరకు క్యాంటీన్ నిర్వహణ బాధ్యతలు తాము తీసుకుంటామంటూ ఆర్యవైశ్య సంఘ నాయకులు ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. మానవసేవే మాధవసేవ అనే భావనతో క్యాంటీన్ నిర్వహణకు ముందుకు వచ్చిన సంఘ నాయకులకు ఎమ్మెల్యే జేబీఆర్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపాలిటీ చైర్మన్ కునిశెట్టి వెంకటేశ్వర్లు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కజం సైదయ్య సురె యల్లమంద మారం ప్రసాద్ సత్యం కంభంపాటి అనిల్ చంటి తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపి ఆర్యవైశ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు