కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో ఒకటో వార్డు కాలనీలో గౌడ్ యూత్ వినాయక మండపం వద్ద ఆదివారం బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నాగుల కనకయ్య గౌడ్ సతీమణి సుజాత ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వినాయక మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన నాగుల సుజాత కనకయ్య గౌడ్ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సుజాత కనకయ్య గౌడ్ దంపతులు భవిష్యత్తులో మరెన్నో సామాజిక సేవ కార్యక్రమాలు చేపట్టాలని, పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాగుల సాయి, బుర్ర తిరుపతి గౌడ్, బుర్ర చిన్న మల్లేశం గౌడ్, భీమనాతి ధర్మయ్య, బుర్ర పెద్ద తిరుపతి, బుర్ర చిన్న మల్లేశం గౌడ్, జితేందర్, బుర్ర రాములు, గుండ నర్సయ్య గౌడ్, మహిళలు సమత, కవిత, సువర్ణ, రజిని, భారతి,భాగ్య, మయూరి, వసంత, పవిత్ర, సుమ, సమత, యువకులు వార్డు సభ్యులు పాల్గొన్నారు.
