- “ఇది మంచి ప్రభుత్వ” పేరుతో వందరోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా
- కరపత్రం విడుదల చేసిన శాసనసభ్యులు నల్లారి.!
అన్నమయ్యజిల్లా,పీలేరు : సంక్షోభంలోను సంక్షేమం, అభివృద్ధిని అందించి,ప్రజా సమస్యలే పరమావధిగా వందరోజులు పాలన పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు మేరకు అంచెల వారీగా సంక్షేమ పథకాలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తుందని,తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీలేరు నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.కూటమి ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎమ్మెల్లే కిషోర్ కుమార్ రెడ్డి తోపాటు అధికారులు, కూటమి సభ్యులు, మహిళలు,”ఇదిమంచి ప్రభుత్వం”పేరుతో కరపత్రం విడుదల చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడు, అవ్వ తాతలకు పెన్షన్ 4000 వేలు అందించడం, దివ్యాంగులకు 6000 ఇవ్వడం, నిరుద్యోగ యువతకు మెగా డీఎస్సీ పై సంతకం చేయడం, అనుకోకుండా వచ్చిన వరదలు విజయవాడలో ముంచెత్తడంతో చంద్రబాబు నాయుడు ఆప్తుడుల నిలిచి సహాయ సహకారాలు అందించి విజయం సాధించారని బాధితులను గట్టున వేశాడని కొనియాడారు. తీవ్ర విపత్కర పరిస్థితుల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో సఫలీకృతమయ్యారని మునిగిన ఇంటికి 25,000వేలు తక్షణ సహాయం అందించి వరద బాధితులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆపద్బాంధవుడులా నిలిచారని కొనియాడారు. నెల నెలా ఒకటవ తేదీన ఉద్యోగులకు వేతనాలు జమ చేయడం,అమ్మలాగా లక్షల మందికి అన్నా క్యాంటీన్ ద్వారా ఆకలి తీర్చడం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం, దౌర్జన్యాలు అరాచకాలకు నిలువరించి శాంతి భద్రతల పరిరక్షణ, గంజాయి రహిత సమాజ స్థాపన,భూ ఆక్రమణలకు అడ్డుకట్ట వేసి శాంతి భద్రతల పరిరక్షణకు గట్టి చర్యలు తీసుకోవడం జరిగిందని ఆయన అన్నారు.అనవసరంగా,ఎప్పుడు లేనివిదంగా నాపై, మా కార్యకర్తలపై, అక్రమ కేసులు నమోదు చేశారని దీని మీద చట్టపరంగా చర్యలు ఉంటాయని అన్నారు. పీలేరు నియోజకవర్గ పరిధిలో ఉన్నతాధి కారులు ప్రజా సమస్యలపై దృష్టి ఉంచి, శాంతి భద్రతలను కాపాడాలని సూచించారు.ఈ కార్యక్రమంలో టిడిపి బిజెపి జనసేనశ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు అనుబంధ సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.