అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం, పొన్నూటి పాలెం వద్ద వన్య ప్రాణులను వేటాడుందుకు అమర్చిన ఉచ్చులో మంగళవారం రాత్రి ఓ చిరుత పులి చిక్కుకుంది. ఉదయం 8. 30 గంటలకు గమనించిన స్థానిక రైతులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు 10 గంటలకు ఘటన స్థలం వద్దకు చేరుకున్నారు. అప్పటివరకు చిరుత పులి నరకయాతన ఉచ్చులో చిక్కుకొని అనుభవిస్తున్న… కాపాడలేని పరిస్థితి నెలకొంది… అధికారులు చుట్టమరీత్యా వచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారు… పులిని ప్రాణాలతో కాపాడాల్సిన అధికారుల నిర్లక్ష్య ధోరణి కారణంగా చిరుత పులి ఎక్కడ చనిపోతుందోనని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
