- కాంట్రాక్టర్లకు ఎమ్మెల్యే షాజహాన్ బాషా సూచన..
- జడ్పీ హైస్కూల్లో మొక్కలు నాటిన ఎమ్మెల్యే…
- 21న అమర రాజ వారి జాబ్ మేళా…
మదనపల్లి, తిరుపతి రోడ్డులోని ఆరోగ్యవరం వద్ద నిర్మిస్తున్న మెడికల్ కళాశాల పనులు నాశరకంగా ఉన్నాయని, వెంటనే పనులు ఆపాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా కాంట్రాక్టర్లకు సూచించారు. శుక్రవారం టిడిపి, జనసేన, బిజెపి నాయకులతో కలిసి మెడికల్ కళాశాల పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. భవనాలను నాణ్యతగా నిర్మించలేదని తన పరిశీలనలో తేలినట్లు తెలిపారు. నాసిరికమైన ఇసుక, కట్టడాలు, పిల్లర్లు సక్రమంగా లేవని గుర్తించినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. గత వైసిపి ప్రభుత్వం లో కాంట్రాక్టర్లు అక్రమాలకు పాల్పడి పనులను సక్రమంగా చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెడికల్ కళాశాల పనులను క్వాలిటీ కంట్రోల్ టీం భవనాలను పరిశీలించాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పనులు చేయకూడదని, వెంటనే ఆపాలని హెచ్చరించారు. అదేవిధంగా ఉదయం తన ఇంటి వద్ద ప్రజా వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలు అర్జీ రూపంలో ఇచ్చిన సమస్యలను పరిష్కారం చేయాలని అధికారులకు సూచించారు. ఆదివారం స్థానిక ఎన్విఆర్ కళ్యాణ మండపంలో ఉదయం 10 గంటలకు నియోజకవర్గంలోని నిరుద్యోగ యువకులకు అమర రాజా కంపెనీ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. యువకులు ఈ జాబ్ మేళాకు హాజరైతే అమరరాజ కంపెనీలో ఉద్యోగానికి ఎంపిక అయ్యే అవకాశం ఉంటుందని చెప్పారు. తెలుగుదేశం పార్టీకి చెందిన రఘుపతి నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేశారు. టిడిపి నాయకులు, అభిమానుల సమక్షంలో ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యే పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి రఘుపతి నాయుడును ఆశీర్వదించారు. అదేవిధంగా జడ్పీ హైస్కూల్లో ఆర్ట్ ఆఫ్ లీవింగ్ వారి ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పచ్చదనం పెంపు కోసం తాను తీవ్రంగా కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కల నాటి మదనపల్లి నియోజకవర్గాన్ని పచ్చదనంలో మొదటి స్థానంలో నిలపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు పి. ఓం ప్రకాష్, టిడిపి నాయకులు ఎస్ఎం రఫీ, ధనలక్ష్మి కరుణ శేఖర్,గంగారపు రామ్మూర్తి నాయుడు,రెడ్డి స్వామి,నరసింహులు,కలకడ వేణుగోపాల్, షంషీర్,నాదెళ్ల శివ,తిరుమల వేణు,మండిపల్లి మధుసూదన్ రెడ్డి,పూలకుంట్ల హరి,బిజెపి ఓసూరి కిరణ్, జెసిబి ఈశ్వర్ నాయుడు,వెంకటరమణారెడ్డి,బాలు స్వామి,సుధాకర్,వెంకటేష్, కరాటే మాస్టర్ మురళి,అధికారులు,తదితరలు పాల్గొన్నారు.