మదనపల్లి:మదనపల్లె మండలం బెంగళూరు రోడ్డు లోని అమూల్ పాల డైరీ ముందు ఓ రైతు పాల బిల్లులు చెల్లించాలంటు శుక్రవారం ఆందోళనకు దిగాడు. గత మూడు నెలలుగా తమ అమూల్ డైరీ పాల బిల్లులు చెల్లించలేదని వాపోయారు. తమ సంఘానికి మొత్తం మూడు లక్షల రూపాయలు రావలసి ఉందని తెలిపారు. వెంటనే తనకు రావలసిన బిల్లును చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై అమూల్ డైరీ మేనేజర్ ని వివరణ కోరగా అమూల్ డైరీ మేనేజర్ లక్ష్మీకాంత్ మాట్లాడుతూ టెక్నికల్ ఇష్యూతో ఎవరికైనా పడకపోయి ఉంటే సాయంత్రానికి ఆయా సంఘం అకౌంట్ లో నగదు జమ అవుతుందని తెలిపారు. ఈ విషయమై రైతులు ఎవరు ఆందోళన చెందవద్దని కోరారు.