అనంతపురం జిల్లా : మడకశిర మండల పరిధిలోని బుల్లసముద్రం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త ప్రసాద్ ఉదయం బుళ్ళసముద్రం గ్రామంలో రోడ్డును దాటుతుండగా ఈచర్ వాహనం ఢీకొని రోడ్డు ప్రమాదంలో ప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే ఎంఎస్ రాజు , మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి , చరవాణి ద్వారా కుటుంబ సభ్యులతో మాట్లాడి తెలుగుదేశం పార్టీ కార్యకర్త ప్రసాద్ కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు వెంటనే స్పందించి తన వ్యక్తిగత సహాయకులు రవికుమార్ ద్వారా 20వేల రూపాయలు కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందజేశారు . తెలుగుదేశం పార్టీ కార్యకర్త మృతుడు ప్రసాద్ కుటుంబానికి అన్ని విధాలుగా తోడుంటామని ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి కుటుంబానికి భరోసా ఇచ్చారు .