అన్నమయ్య జిల్లా : పీలేరు మండలం కావలిపల్లి పంచాయతీ ఒంటిల్లులో గత వారం మంగళ వారంరాత్రి టీడీపీ కార్యకర్త గిరినాయుడు,వారి కుటుంబ సభ్యులపై తుపాకులతో బెదిరించి చంపడానికి ప్రయత్నించిన దుండగుల కాల్పుల ఘటన కలకలం రేపింది.సమాచారం అందుకున్న తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పీలేరు శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, గిరి నాయుడు,వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. జరిగిన ఘటనపై వారికుటుంబ సభ్యుల్ని అడిగి తెలుసుకున్నారు. ప్రమాదవశాత్తు ఎలాంటి ప్రాణాపాయం జరగలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, నల్లారి అభిమానులు పాల్గొన్నారు.