- PVB పాఠశాల కరస్పాండెంట్ శ్రీనివాసరెడ్డి పై చర్యలు తీసుకోవాలి.
- ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పాఠశాల ఎదురుగా ధర్నా
అన్నమయ్య జిల్లా , మొలకలచెరువు : అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మొలకలచెరువు మండలంలోని SPVB పాఠశాల ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ నెల రెండో తారీఖున ఎస్పి విబి పాఠశాలలో ఆరవ తరగతి చదువుతున్న మహమ్మద్ యాసిన్ విద్యార్థి పై పాఠశాల కరస్పాండెంట్ శ్రీనివాస్ రెడ్డి విచక్షణారహితంగా దాడి చేసి విద్యార్థిని గాయపరిచి చిత్రహింసకు గురి చేశారని ఇతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని అఖిల భారత విద్యార్థి సమైక్య ఐఏఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ ఘటనపై విద్యార్థి తల్లిదండ్రులు సంఘటన జరిగిన తరువాత స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే పోలీసు వారు పట్టినట్లు వ్యవహరించినందుకు ఏఐఎస్ఎఫ్ గా అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఈ సందర్భంగా ఆయన అన్నారు. అదేవిధంగా పాఠశాలలో విచారణ పేరుతో డివైఈవో, ఎంఈఓ విద్యార్థి తల్లిదండ్రులు ను పిలవకుండా పాఠశాల కరస్పాండెంట్, అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయుల ను విచారించడం సరైనది కాదని విద్యార్థి తల్లిదండ్రులని పిలిపించి విచారణ జరిపి ఉంటే బాగుండేదని అన్నారు. ఈ పాఠశాలపై డివైఈవో సమగ్రమైన విచారణ జరిపి మహమ్మద్ యాసిన్ పై దాడి చేసిన కరస్పాండెంట్ పై క్రిమినల్ కేసులు బనాయించి, పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని డివైఈవో కి వినతి పత్రం అందజేశారు. లేనిపక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు ధర్నాలు చేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వ అధికారులకు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా కోశాధికారి వినయ్, మంజునాథ్, గణేష్, లిఖిత్ ,హేమంత్, నాగరాజు, విద్యార్థి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.