అన్నమయ్య జిల్లా, రాయచోటి : అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరుకి చెందిన మతిస్థిమితం లేని మాటలు రాని అమ్మాయి గత కొద్దిరోజులుగా ఇంటి నుండి తప్పిపోయి తెలంగాణా లోని వనపర్తి లో ప్రత్యక్షం అయ్యింది. అయితే ఆమె వనపర్తి పోలీస్ స్టేషన్ సమీపంలో ఉండగా అక్కడ పనిచేస్తున్నటువంటి కానిస్టేబుల్ రామకృష్ణ, సమీపంలోని సఖి సెంటర్ కు తీసుకొచ్చారు. అక్కడ C A గా పనిచేస్తున్న కవిత సోమవారం రైల్వే కోడూరు లోని సొంత ఇంటికి చేర్చారు. తమ బిడ్డ తిరిగి ఇంటికి రావడంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. తమ బిడ్డను ఇంటికి తీసుకొచ్చిన కవిత ని, కానిస్టేబుల్ రామకృష్ణని వారు అభినందించారు.