అన్నమయ్య జిల్లా: పర్యావరణ పరిరక్షణలో భాగంగా సేవ్ ట్రీస్ సేవ్ ఫారెస్ట్ పేరిట పలమనేర్ నుంచి లడక్ వరకు సైకిల్ యాత్ర చేపట్టిన బషీర్ ను పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి అభినందించారు. పలమనేరు పట్టణంలోని శ్రీనగర్ కాలనీకి చెందిన బషీర్ జూన్ 12 న ఈ సైకిల్ యాత్రను ప్రారంభించి లడక్ పర్యటనను ముగించుకొని శుక్రవారం రాత్రి ఇక్కడికి చేరుకున్నారు. దీంతో ఆ యువకున్ని స్థానిక ఎమ్మెల్యే అభినందించారు. నేటి యువతకు ఆదర్శంగా నిలవడంతో పాటు పర్యావరణహితం కోరుతూ యాత్ర చేపట్టడం హర్షించదగ్గ విషయమని కొనియాడారు. భవిష్యత్తులో నేపాల్ మరియు ఇతర ప్రాంతాలలో యాత్రను చేపట్టనున్నట్లు బషీర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.