అల్లూరి సీతారామరాజు జిల్లాలో మావోయిస్టుల, పోలీసుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నారు. యు.చీడిపాలెం పంచాయతీ పరిధిలోని కాకుల మామిడి, కంటారం సమీపంలోని రెండు చోట్ల మావోయిస్టు కదలికలను గమనించిన పోలీసు బలగాలు కాల్పులు జరపగా మావోయిస్టులు ఎదురుదాడికి దిగారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
ఇదిలా ఉండగా ఎదురుకాల్పుల్లో తప్పించుకున్న మావోయిస్టుల కోసం పోలీసులు విస్త్రృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. వారిని తుదముట్టించేందుకు అక్కడకు మరిన్ని బలగాలు చేరుకుంటున్నాయి. ఆంధ్ర ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో కర్రెగుట్ట అడవులలోని నిర్బంధం పెరగడంతో అక్కడి నుంచి మావోయిస్టులు తప్పించుకొని జిల్లాల్లోనికి ప్రవేశించి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అందుకుగాను జిల్లా వ్యాప్తంగా గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేశారు.