contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఏపీలో 144 సెక్షన్‌ అమలవుతోంది ..: సీఈవో ముఖేశ్‌కుమార్‌ మీనా

విజయవాడ: ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్‌కుమార్‌ మీనా మీడియా సమావేశం :

  • రాష్ట్రంలో 144 సెక్షన్‌ అమలవుతోంది
  • ఎలాంటి కార్యక్రమం అయినా అనుమతులు తీసుకోవాల్సిందే.
  • సువిధ యాప్‌ ద్వారా అనుమతులు తీసుకోవాలి.
  • ఇప్పటి వరకు 392 దరఖాస్తులు పరిష్కరించాం.
  • వాలంటీర్లు, ఒప్పంద ఉద్యోగులపై ఎక్కువగా ఫిర్యాదులు వచ్చాయి.
  • 46 మందిపై చర్యలు తీసుకున్నాం.
  • కొందరు వాలంటీర్లను విధుల నుంచి తొలగించాం.
  • ప్రభుత్వ భవనాలపై నేతల ఫొటోలు, ప్రకటనలు తొలగించాలని ఆదేశించాం .
  • ప్రభుత్వ ఉద్యోగులు ప్రజాప్రతినిధులతో కలిసి తిరగకూడదు.
  • ఎప్పటికప్పుడు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ తనిఖీలు చేసి కేసులు నమోదు చేస్తుంది
  • సీ విజిల్‌ యాప్‌లో నమోదైన ఫిర్యాదులపై 100 నిమిషాల్లో చర్యలు తీసుకుంటున్నాం .
  • సీ విజిల్‌ ద్వారా ఎవరైనా ఫొటో, వీడియో తీసి పంపవచ్చు.
  • ఇప్పటి వరకు 1.99 లక్షల పోస్టర్లు, బ్యానర్లు, హోర్డింగ్‌లు తొలగించాం.
  • 385 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశాం .
  • 3 రోజుల్లో రూ.3.39 కోట్ల విలువైన నగదు, మద్యం స్వాధీనం చేసుకున్నాం.
  • ప్రస్తుతం తనిఖీల్లో 173 బృందాలు పాల్గొంటున్నాయి .
  • డీఎస్సీపై విద్యాశాఖ వివరణ కోరాం .
  • డీఎస్సీ నిర్వహణపై సీఈసీకి లేఖ రాస్తాం.
  • ఉస్తాద్ భగత్‍సింగ్ సినిమా టీజర్ నేను చూడలేదు .
  • టీజర్ పొలిటికల్ ప్రచారం తరహాలో ఉంటే ఈసీ అనుమతి తీసుకోవాల్సిందే.
  • రాజకీయ హింస జరగకుండా చూడాలన్నదే మా లక్ష్యం.
  • హింస రహిత, రీపోలింగ్ లేని ఎన్నికలే లక్ష్యంగా పనిచేస్తున్నాం.
  • గిద్దలూరు, ఆళ్లగడ్డలో రాజకీయ హత్యలు జరిగాయి.
  • ప్రకాశం, నంద్యాల, పల్నాడు ఎస్పీలతో మాట్లాడుతాం.
  • ఎస్పీల వివరణతో పాటు నివేదిక చూశాక చర్యలు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :