- డీఎస్పీ ప్రసాద్ రెడ్డి, సెబ్ ఈ.ఎస్ వి.శ్రీనివాసులు వెల్లడి
మదనపల్లె : డివిజన్ పరిధిలోని ఎన్నికల సమయంలో వివిధ కేసుల్లో పట్టుబడిన మద్యం,నాటుసారాను మదనపల్లి సమీపంలోని ఓల్డ్ బైపాస్ రోడ్డు,కనుమలో గంగమ్మ గుడి దగ్గర ఎక్సైజ్ సూపరిండెంట్ వి.శ్రీనివాసులు వాల్మీకి,మదనపల్లి సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ జి.ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో జెసిబితో ధ్వంసం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా ఎస్పీ కృష్ణారావు ఆదేశాల మేరకు 59 కేసుల్లో పట్టుబడ్డ రూ.2,83,050 విలువైన 31.22 లీటర్ల మద్యం,847.2 లీటర్ల నాటుసారాను ధ్వంసం చేయడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో మదనపల్లి వన్ టౌన్ సీఐ యు.వలీ బాషా,రూరల్ సీఐ సద్గురుడు,నిమ్మనపల్లి ఎస్.ఐ.లోకేష్,పెద్దమండ్యం ఎస్.ఐ.చలపతి మరియు ఎస్ఈబి సిబ్బంది పాల్గొన్నారు.