AP CEO MK MEENA ON Electoral Ink: చెరగని సిరా ద్వారా ఇంటి వద్దే మార్కు చేస్తున్నట్టుగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారంపై సీఈవో ముఖేష్ కుమార్ మీనా స్పందించారు. చెరగని సిరా ఇతరులకు అందుబాటులో ఉంటుందనేది తప్పుడు ప్రచారం అని ఎంకే మీనా స్పష్టం చేశారు. ఇతర సిరా ద్వారా ఓటర్ల వేళ్లపై మార్కు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
AP CEO MK MEENA ON Electoral Ink: ఇతర సిరా ద్వారా ఓటర్ల వేళ్లపై మార్కు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా హెచ్చరించారు. చెరగని సిరా ఇతరులకు అందుబాటులో ఉంటుందనేది తప్పుడు ప్రచారమని తెలిపారు. చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్లపై వారి ఇంటి వద్దే మార్కు వేస్తున్నట్టుగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోందని, ఇది వాస్తవం కాదని స్పష్టం చేశారు.
ఈ తరహా ప్రచారం సరికాదన్నారు. చెరగని సిరా ప్రభుత్వం మాత్రమే తయారు చేస్తుందని వెల్లడించారు. ఈ సిరా భారత ఎన్నికల సంఘం వద్ద మాత్రమే అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ సిరా భారతీయ ఎన్నికల సంఘం వద్ద కాకుండా ఇతరులు ఎవరికైనా అందుబాటులో ఉంటుందనేది తప్పుడు ప్రచారమే అని తేల్చిచెప్పారు. ఎవరైనా ఇతర సిరాల ద్వారా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పోలింగ్ నిర్వహణకు సన్నద్ధం :ముఖేశ్ కుమార్ మీనా – AP CEO Mukesh
అదే విధంగా మొత్తం 46 వేల 389 పోలింగ్ కేంద్రాల్లో 34 వేల 165 చోట్ల వెబ్‌క్యాస్టింగ్ చేస్తున్నామని ముఖేష్ కుమార్ మీనా అన్నారు. ఒపీనియన్ పోల్, ఎగ్జీట్ పోల్స్‌పైనా నిషేధం ఉందని తెలిపారు. ఈసారి 10 లక్షల మంది యువ ఓటర్లు ఓటు హక్కు వినియోగించు కోబోతున్నారన్నారు. సెలవు ఇవ్వాలని విద్యా సంస్థలకు సూచనలు చేశామన్నారు. అలాగే ప్రైవేటు, ప్రభుత్వ సంస్థలకు సెలవు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చామన్నారు. 1.60 లక్షల ఈవీఏంలు పోలింగ్ కోసం వినియోగిస్తుని తెలిపారు. ఎన్నికల రోజు హింస జరగకుండా చూడాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామన్నారు.
ఎన్నికల సంఘం హామీ: ఎక్కడ ఎలాంటి హింసాత్మక ఘటనలు జరిగినా కఠినంగా వ్యవరిస్తామన్నారు. ఈ విషయంలో ఎన్నికల సంఘం హామీ ఇస్తోందని పేర్కొన్నారు. పోలింగ్ రోజు ఎక్కడా రాష్ట్ర సరిహద్దులను సీజ్ చేయడం లేదని అన్నారు. ఓటరుగా ఉన్న ఏ వ్యక్తిని నిలువరించడం లేదని తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద దివ్యాంగులు, వృద్ధులకు ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. గతంలో 79.84 శాతం మేర పోలింగ్ నమోదు అయ్యిందని తెలిపారు. ఈసారి 83 శాతం మేర పోలింగ్ జరిగేలా ప్రయత్నాలు చేస్తున్నామని ముఖేష్‌కుమార్ మీనా తెలిపారు.
13వ తేదీన సరిగ్గా 7 గంటలకు: మే 13 తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ జరుగుతుందని ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. 6 నియోజకవర్గాల్లో 3 చోట్ల 4 గంటలకు, మూడు చోట్ల 5 గంటలకే పోలింగ్ ముగుస్తుందని అన్నారు. 13వ తేదీన సరిగ్గా 7 గంటలకు పోలింగ్ మొదలు అవుతుందని వెల్లడించారు. అలాగే పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల పరిధిలో రాజకీయ పార్టీలు ఎలాంటి చిహ్నాలు ఉండకూడదని తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లోకి ప్రిసైడింగ్ అధికారి మినహా ఎవరూ ఫోన్లు తీసుకు వెళ్లేందుకు అనుమతి లేదని అన్నారు. ఓటర్లు కూడా ఫోన్లు తెచ్చేందుకు అనుమతి లేదని అన్నారు. అలాగే ఆయుధాలతో ఎవరూ పోలింగ్ కేంద్రాల్లోకి అననుమతించమని అన్నారు. మంత్రులు, ప్రజా ప్రతినిధులు ఎవరూ గన్ మెన్లతో పోలింగ్ కేంద్రాల్లోకి రావొద్దని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.