నేడు విజయవాడలో రాష్ట్రంలో గుర్తింపు పొందిన పార్టీల ప్రతినిధులతో ఏపీ ఎన్నికల కమిషనర్ ముకేష్ కుమార్ మీనా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో అక్రమాలు చోటుచేసుకోకుండా ప్రశాంతంగా నిర్వహించేందుకు పార్టీలన్నీ సహకరించాలని మీనా కోరారు. ఇదిలాఉంటే ఈ నెల 13న ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేందుకు ఈసీ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నాయి.