ఎపి / నెల్లూరు : వైసీపీలో నెల్లూరు పంచాయితీ ముగిసింది. సీఎం జగన్ తో మాట్లాడిన తర్వాత నెల్లూరు ఎంపీ గా పోటీ చేయడానికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. నెల్లూరు సిటీ నుంచి అనిల్ కుమార్, కావలి నుంచి ప్రతాప్ కుమార్ రెడ్డి, ఉదయగిరి నుంచి మేకపాటి ఫ్యామిలీ సభ్యులు పోటీ చేస్తారని సీఎం జగన్ వేమిరెడ్డికి చెప్పినట్లు తెలుస్తోంది. సీఎం చొరవతో నెల్లూరు జిల్లా వైసీపీలో కొన్ని రోజులుగా నెలకొన్న వివాదానికి తెరపడింది.