contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఎపి హోమ్ మంత్రి కారు కు భారీ ప్రమాదం

ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనితకు తృటిలో ప్రమాదం తప్పింది. మంత్రి కాన్వాయ్ లోని ఓ కారు సడెన్ బ్రేక్ వేయడంతో వెనక వస్తున్న మంత్రి కారు దానిని ఢీ కొట్టింది. విజయవాడ నుంచి పశ్చిమగోదావరి జిల్లా అలంపురం వెళ్తుండగా ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం కైకరం వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఓ బైక్ ను తప్పించే క్రమంలోనే ఎస్కార్ట్ కారు డ్రైవర్ సడెన్ బ్రేక్ వేసినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో మంత్రి కారు, ఎస్కార్ట్‌ వాహనం స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో మంత్రితో సహా కారులోని ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. మంత్రి అనిత మరో వాహనంలో అలంపురం వెళ్లారని వివరించారు.

 

Karampudi : పాడుపడ్డ ఆర్టీసీ బస్ స్టాండ్

Palnadu: ఊరు వదిలి వలస పోతున్న ప్రజలు

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :