- ష్టపడి చదవండి..లక్ష్యాన్ని చేరుకోండి
- శాటిలైట్ సిటీలో జూనియర్ కళాశాల భవన శంకుస్థాపన మహోత్సవ సభలో ఎంపీ భరత్
రాజమండ్రి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి విద్య, వైద్యం రెండు కళ్ళని, విద్యార్థులంటే ప్రాణమని వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ అన్నారు. రాజమండ్రి రూరల్ శాటిలైట్ సిటీ గ్రామంలో ఈ విద్యా సంవత్సరం జూనియర్ కళాశాల శాంక్షన్ అయింది. ఈ కళాశాల భవనానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 1.44 కోట్లు మంజూరు చేసింది. ఎకరం పదిహేను సెంట్ల సువిశాల స్థలంలో 12 తరగతి గదులతో నిర్మించే కళాశాల భవన శంకుస్థాపన మహోత్సవానికి జిల్లా పరిషత్ ఛైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, రుడా ఛైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, రూరల్ కోఆర్డినేటర్ చందన నాగేశ్వర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభకు ఎంపీ భరత్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. పేద విద్యార్థులకు కూడా నాణ్యమైన కార్పోరేట్ పాఠశాలల స్థాయి విద్యా బోధన అందాలన్నదే సీఎం జగన్ సంకల్పమన్నారు. అందుకే ఆంగ్ల భాషా బోధన, విద్యార్థులలో ఆత్మన్యూనతా భావాన్ని తొలగించేందుకు అందరికీ యూనిఫారం, షూష్, టై, పుస్తకాలు, పాఠశాలల్లో ఫర్నీచర్, టాయ్ లెట్స్..ఇలా అన్నిటిపైనా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, అందుకోసం లక్షల కోట్లు వెచ్చిస్తున్నారని చెప్పారు. గత టీడీపీ చంద్రబాబు పాలనలో విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని, కార్పోరేట్ మాఫియా చేతులకు అప్పగించేశారని అన్నారు. ముఖ్యమంత్రి జగనన్న విద్యారంగానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ నాడూ నేడూ పథకం ద్వారా పాఠశాలల రూపురేఖలు ఏ విధంగా మారుస్తున్నదీ వివరించారు. విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నతవంతులై ఉన్న ఊరుకు, కన్న తల్లిదండ్రులకు, చదువుకున్న పాఠశాలకు మంచి గుర్తింపు తీసుకురావాలని ఎంపీ భరత్ ఆకాంక్షించారు. ఈ సంవత్సరమే కళాశాల శాంక్షన్ అయింది కాబట్టి 60 మంది ఉన్నారని, రానురాను ఈ కళాశాల మరింతగా అభివృద్ధి చెందగలదనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. వచ్చే విద్యా సంవత్సరానికి కళాశాల భవన నిర్మాణం పూర్తి అవుతుందన్నారు. ఇష్టపడి చదివి మీరనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇప్పట్నుండే సాధనకు సిద్ధపడాలని ఎంపీ భరత్ విద్యార్థులను ఉద్దేశించి అన్నారు.