ఎపి /విశాఖ : విశాఖలో ఓ బాలికపై పది మంది అత్యాచారానికి పాల్పడిన ఘటనపై టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వంగలపూడి అనిత తీవ్రస్థాయిలో స్పందించారు. విశాఖలో గ్యాంగ్ రేప్ జరిగితే మహిళా కమిషన్ ఏంచేస్తోందని ప్రశ్నించారు. కనీసం బాధితురాలిని పరామర్శించే తీరిక కూడా లేదా? అని నిలదీశారు. “గ్యాంగ్ రేప్ ఘటనను పోలీసులు ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారు? విశాఖ పోలీస్ కమిషనర్ ఇంతవరకు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు? బాధితురాలు ఆసుపత్రిలో ఉందని ఒకసారి… లేదు, ఆమెను డిశ్చార్జి చేశారని మరోసారి ఎందుకు చెప్పారు?” అని అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు.
