ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికల వేళ స్పీకర్ తమ్మినేని సీతారాం ( Tammineni Seetaram ) సంచలన నిర్ణయం తీసుకున్నారు. 8మంది రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. వైసీపీ, టీడీపీ పార్టీలు ఇచ్చిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ చేపట్టి..న్యాయ నిపుణుల సలహా మేరకు స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీ కోరగా..మద్దాల గిరి, కరణం బలరాం, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేశ్ పై టీడీపీ పిటిషన్ ఇచ్చింది. దీంతో ఈ మధ్యే విచారణ ముగించిన స్పీకర్ వారిపై అనర్హత వేటు వేస్తున్నట్లు ప్రకటించారు.