- విచక్షణారహితంగా కొట్టిన పోలీసులు దెబ్బలు దాటికి విరిగిన కాలు ఎముక పోలీసులు తీరిపై సిపి సీరియస్ ఎస్ఐతో పాటు ఇద్దరు కానిస్టేబుల్ సస్పెన్షన్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు.
విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం బందెపు పురంలో ఇందుకూరి రాజాబాబు ఇంట్లో నాటు కోళ్లు పెంచుతుంటారు అదే గ్రామానికి చెందిన డి పాపు అనే దళిత యువకుడు ఒక పుంజును చోరీ చేసి వేరొకరికి 4700 కి విక్రయించినట్లు అభియోగం, ఈ విషయం నాలుగు రోజుల తర్వాత రాజబాబుకు తెలియడంతో పిలిచి నిలదీయగా నేరాన్ని అంగీకరించాడు, పెద్దలకు సమక్షంలో పంచాయతీ పెట్టి 12,000 జరిమానా విధించారు. ఆ మొత్తాన్ని చెల్లింపులు జాప్యం జరగడంతో గత నెల 29న రాజబాబు, పద్మనాభం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మల్లేశ్వరరావు గత నెల కేసు నమోదు చేసి పాపును ఆదివారం ఉదయం స్టేషన్ పిలిచి విచారణ ప్రారంభించారు. సాయంత్రం కాగానే క్రైమ్ కానిస్టేబుల్ కే శ్రీనివాసరావు విచక్షణారహితంగా కొట్టడం ప్రారంభించారు. ఆపరేషన్ జరిగిన కాలుపై గట్టిగా తన్నడం తో తొడ భాగంలో ఎముక విరిగింది. ఈ విషయం బాధితుడు కుటుంబ సభ్యులకు తెలియడంతో వారు పాపును ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులు తీరుకు ఆదివారం రాత్రి కుటుంబ సభ్యులు ఆందోళన నిర్వహించారు. యువకుడు పై విచక్షణారహితంగా సచ్చేవిధంగా కొట్టారు. క్రైం ఎస్సై మల్లేశ్వర రావు నిర్లక్ష్యం కారణంగా ఇదంతా జరిగినట్లు డీసీపీ విచారణలో తేలినట్టు తెలిసింది. దీంతో క్రైమ్ ఎస్సై తో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లను సిపి రవిశంకర్ అయ్యనార్ సోమవారం సస్పెండ్ చేశారు. వారిపై ఎస్సీ ఎస్టీ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయాలని ఆదేశించారు.