contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

విడదల రజినికి హైకోర్టు బిగ్ షాక్

వైసీపీ మాజీ మంత్రి విడదల రజని ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గురువారం నాడు విచారణను వాయిదా వేసింది. అవినీతి ఆరోపణల కేసులో ఆమె ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.

విచారణ చేపట్టిన హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. కౌంటర్ దాఖలు చేయాలని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)ను ఆదేశించి, తదుపరి విచారణను ఏప్రిల్ 2వ తేదీకి వాయిదా వేసింది.

వివరాల్లోకి వెళితే, మాజీ మంత్రి విడదల రజని, సస్పెండ్ అయిన ఐపీఎస్ అధికారి పల్లె జాషువా, మరో ఇద్దరిపై ఏసీబీ ఈ వారం ప్రారంభంలో అవినీతి కేసు నమోదు చేసింది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పాలనాడు జిల్లాలోని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ యజమానుల నుంచి రూ. 2.2 కోట్లు వసూలు చేసినట్లు వీరిపై ఆరోపణలు ఉన్నాయి.

అయితే మాజీ మంత్రి రజని ఈ ఆరోపణలను ఖండిస్తున్నారు. టీడీపీ నేతృత్వంలోని ప్రభుత్వం రాజకీయ కక్షతో వ్యవహరిస్తోందని అన్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైసీపీని వీడిన ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు వ్యక్తిగత కక్షతోనే తనపై కేసు సృష్టించారని ఆమె ఆరోపించారు.

ఈ కేసులో రజనిని ప్రధాన నిందితురాలిగా పేర్కొనగా, ఆ తర్వాత ప్రాంతీయ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి (ఆర్వీఈవో)గా పనిచేసిన పల్లె జాషువా, రజని మరిది విడదల గోపి, ఆమె వ్యక్తిగత సహాయకుడు దొడ్డ రామకృష్ణలను నిందితులుగా చేర్చారు. వీరంతా అధికారాన్ని దుర్వినియోగం చేసి, నేరపూరిత చర్యలకు పాల్పడి బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారని అభియోగాలు మోపారు.

స్టోన్ క్రషింగ్ కంపెనీ మేనేజింగ్ పార్టనర్ నల్లపనేని చలపతి రావు ఫిర్యాదు మేరకు… రజని ఇతర నిందితులతో కుమ్మక్కై రూ. 2 కోట్లు లంచం వసూలు చేశారని, జాషువా, గోపి ఒక్కొక్కరు మరో రూ. 10 లక్షలు చొప్పున చేశారని ఆరోపించారు. తమ కంపెనీ కార్యకలాపాలను కొనసాగించాలంటే తమకు రూ.5 కోట్లు ఇవ్వాలని రజని, జోషువా మొదట్లో డిమాండ్ చేశారని చలపతి రావు ఆరోపించారు.

ఈ ఫిర్యాదుపై స్పందించిన విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్ విచారణ జరిపి, 2024 డిసెంబర్ 3న రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్లు సమాచారం. ఈ నివేదిక ఆధారంగా ఏసీబీ అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు 7, 7A, IPCలోని సెక్షన్లు 384, 120B కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
భారత్ – అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాల విషయంలో చైనా, కెనడా, మెక్సికోలతో భారత్‌ను చూడబోమని అమెరికా పేర్కొంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన పరస్పర సుంకాలు ఏప్రిల్ 2 నుంచి అమలులోకి రానున్న నేపథ్యంలో భారత్ – అమెరికాల మధ్య వాణిజ్యపరమైన ఒప్పందానికి సంబంధించిన చర్చలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ చర్చల సందర్భంగా అమెరికా ఈ విధంగా కీలక వ్యాఖ్యలు చేసింది.

భారత్ – యూఎస్ మధ్య వాణిజ్య ఒప్పందాలపై చర్చించేందుకు వాషింగ్టన్ వాణిజ్య అధికారి బ్రెండన్ లించ్ తన బృందంతో కలిసి భారత్‌కు వచ్చారు. ఈ క్రమంలో భారత అధికారులతో ఆ బృందం చర్చలు ప్రారంభించింది. ఇరుదేశాలు వాణిజ్యంపై శుక్రవారం నాటికి ఒక ఒప్పందానికి వచ్చే అవకాశం ఉంది. రెండు దేశాల ప్రభుత్వాలకు సంతృప్తికరమైన ఫలితం ఉంటుందని భావిస్తున్నామని చర్చల్లో పాల్గొన్న ఓ అధికారి తెలిపారు.

కాగా, ఈ వాణిజ్య ఒప్పందాలకు సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏప్రిల్‌లో వాషింగ్టన్‌లో పర్యటించనున్నారు అని మరో అధికారి తెలిపారు. ఈ పర్యటనలో వాణిజ్యం, సుంకాలు వంటి అంశాలతో పాటు ఇరుదేశాల మధ్య ఆర్థిక, ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :