- మాణిక్యరావును అభినందించిన మంత్రి వీరాంజనేయ స్వామి.
ఆంధ్ర ప్రదేశ్ చర్మకార పారిశ్రామిక అభివృద్ధి సంస్థ(లిడ్ క్యాప్) చైర్మన్ గా పిల్లి మాణిక్యరావు శుక్రవారం ఉదయం తాడేపల్లి కార్యాలయం నందు అధికారికంగా పదవి బాధ్యతలు చేపట్టారు.
ఈ సందర్భంగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి మాణిక్యరావును కలిసి అభినందించారు. తన కష్టానికి తగిన ఫలితం లభించిందని హర్షం వ్యక్తం చేశారు. పిల్లి మాణిక్యరావు గతంలో ఎమ్మార్పీఎస్ నాయకుడిగా, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నారు. మాణిక్యరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కష్టాన్ని గుర్తించి తనకు తగిన వ్యయప్రయాసలతో కూడిన బాధ్యతను అప్పగించారని, కార్పొరేషన్ అభివృద్ధికి కృషి చేస్తానని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో లిడ్ క్యాప్ డెవలప్మెంట్ అధికారులు, సిబ్బంది, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు