contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఆర్మూర్ ఇండోర్ స్టేడియం — అసాంఘీ కార్యకలాపాలకు నిలయం

  • రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న బిజెపి ఆర్మూర్ పట్టణ శాఖ.

2017లో ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఆర్మూర్ లోని క్రీడా ప్రాంగణంలో ఇండోర్ స్టేడియానికి ఒక కోటి 50 లక్షలు వెచ్చించి నిర్మాణం చేసి ప్రారంభించకున్న ముందే శిథిలావస్థకు చేరడమే కాకుండా ఇండోర్ స్టేడియం అసాంఘిక కార్యకలాపాలకు నిలియంగా, అడ్డాగా మారడాన్ని బిజెపి తీవ్రంగా పరిగణిస్తూ… ఇండోర్ స్టేడియాన్ని పరిశీలించిన అనంతరం బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి జీవీ నరసింహారెడ్డి, బిజెపి ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు జెస్సు అనిల్ కుమార్ పాత్రికేయులతో మాట్లాడుతూ….

రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహిస్తామని, క్రీడా ప్రాంగణాలను అభివృద్ధి చేస్తామని మాట ఇవ్వడమే తప్ప చేతలలో చిత్తశుద్ధి కొరవడింది అనడానికై ఆర్మూర్ లో ఉన్నటువంటి ఇండోర్ స్టేడియాన్ని చూస్తే కానీ ఆ అభివృద్ధి ఏమిటో స్పష్టం అవుతుందని. ఇండోర్ స్టేడియంలో ఆడవలసిన ఆటలచోట పందుల సైరవిహారం, మురికి కాలువ నీరు పారడం, అసాంఘిక కార్యక్రమాలకు నిలియంగా మారడం ఇదేనా అభివృద్ధి అని టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులకు, నాయకులకు ప్రశ్నిస్తూ?.. అభివృద్ధి అంటే బీదవారి భూములను లాక్కోవడం, వీరి వద్ద దోచుకోవడం — లాక్కున్నటువంటి భూములను, దోచుకున్న వాటిని దాచుకోవడం. అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు అభివృద్ధి అంటే పేద ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టి ఇవ్వాలన్న సోయిని మరవడం — ఆర్మూర్ యంఎల్ఎ జీవన్ రెడ్డి పేరుతో మహళ్ళు ఏర్పాటు చేయడం. దోచింది దాచుకోవడం — దోచుకున్న దాన్ని దాచుకోవడం అనే సిద్ధాంతమే వీరి అభివృద్ధిగా కనపడతా ఉందని. తెలంగాణ కోసం పోరాటం చేసిన సబ్బండ వర్గాలను సైతం మోసం చేయడమే వీరి అభివృద్ధి. బంగారు తెలంగాణ పేరుతో మోసం చేస్తూ క్రీడాకారులకు సైతం అన్యాయం చేస్తూ క్రీడా ప్రాంగణాలను సైతం అభివృద్ధికి నోచుకోని విధంగా మార్చడమే కాకుండా క్రీడా ప్రాంగణాలను, ఇండోర్ స్టేడియంలో సైతం కబ్జాలు చేసి హౌస్ నంబర్లు ఇచ్చి బీఆర్ఎస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు పంచుకుంటారా అని భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ ను, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ని ప్రశ్నిస్తూ…. వెంటనే క్రీడా ప్రాంగణంలో ఉన్నటువంటి మినీ స్టేడియాన్ని, ఇండోర్ స్టేడియాన్ని అభివృద్ధి చేయాలని. క్రీడా ప్రాంగణానికి కావాల్సిన సౌకర్యాలను వెంటనే ఏర్పాటుచేయాలని. లేనిపక్షంలో ఇదే క్రీడా ప్రాంగణంలో ఇండోర్ స్టేడియం ముందు నిరాహార దీక్ష చేస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని హెచ్చరించడమైనది.

ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు ద్యాగ ఉదయ్, పల్లె శ్రీనివాస్, బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు పోల్కం వేణు, బిజెపి ఆర్మూర్ పట్టణ ఉపాధ్యక్షులు భూసం ప్రతాప్, దోండి ప్రకాష్, భవాని నవీన్, ఓబీసీ మోర్చ పట్టణ అధ్యక్షులు బాసెట్టి రాజ్ కుమార్, దళిత మోర్చ ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు పులి యుగంధర్ మరియు తోపారం పోశెట్టి తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :