contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఇండియన్ ఆర్మీ లో ఉద్యోగ అవకాశాలు : పల్నాడు జిల్లా కలెక్టర్

భారత సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనుకున్న యువతకు ఉద్యోగాల అవకాశం ప్రభుత్వం కల్పిస్తున్నట్టు పల్నాడు జిల్లా కలెక్టర్ శివ శంకర్ లోతేటి పేర్కొన్నారు. కలెక్టరేట్ లోని ఎస్. ఆర్. శంకరన్ హాల్లో గురువారం ఆర్మీ కల్నల్ పునీత్ తో కలిసి జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి “ఆర్మీ అగ్ని వీర్” ఉద్యోగ నియామకాలపై మీడియాతో మాట్లాడారు. భారత సైన్యంలో అగ్ని వీర్ ద్వారా ఉద్యోగ నియామకం పొంది, దేశానికి మరిన్ని సేవలు అందించే అవకాశం ప్రభుత్వం కల్పిస్తుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. భారత ఆర్మీ అగ్ని వీర్ ఉద్యోగ అవకాశాలలో మూడు విభాగాలకు సంబంధించిన అంశాలను ప్రస్తావించారు. భారత్ ప్రభుత్వం కొత్తగా ఆర్మీ రిక్రూట్మెంట్ విధానంలో మార్పులు చేసినట్లు తెలిపారు. 2023, ఫిబ్రవరి నాటికి 17 వయసు నిండి, 21 ఏళ్ల వయసు లోపు వారికి అగ్ని వీర్ ఆర్మీ ఉద్యోగ అవకాశం పొందే విధానాలను జిల్లా కలెక్టర్ వివరించారు. పదో తరగతి విద్యార్హత పూర్తి చేసిన వారికి జనరల్ డ్యూటీ, ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేసిన వారికి సాంకేతిక(టెక్నికల్), నర్సింగ్ విభాగాల్లో ఆర్మీ వ్యవస్థ నియామకాలను చేపడుతుందని తెలిపారు. భారతదేశ వ్యాప్తంగా అగ్ని వీర్ ఆర్మీ రిక్రూట్మెంట్ కార్యక్రమం చేపడుతుందన్నారు. జిల్లాకు సంబంధించి సుమారుగా 500 కు పైగా ఉద్యోగ అవకాశాలు ఉన్నట్లు జిల్లా కలెక్టర్ వివరించారు. జిల్లాలో గుంటూరు, చీరాల ప్రాంతాలలో ఆర్మీ రిక్రూట్మెంట్ పరీక్షా కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. పూర్తిస్థాయి పారదర్శకంగా ఆన్ లైన్ ద్వారా’ JIA ‘ (జాయిన్ ఇండియన్ ఆర్మీ. ఎన్.ఐ.సి. ఇన్ ) పోర్టల్ ద్వారా ఉద్యోగాల కోసం దరఖాస్తు చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. భారత ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన ఆర్మీ రిక్రూట్మెంట్ (అగ్ని వీర్) పథకం వివరాలను జిల్లా కలెక్టర్ మీడియాకు వివరించారు. ఆర్మీ రిక్రూట్మెంట్ ఉద్యోగ నియామకానికి సంబంధించి మార్చి 15 లోపు ఆసక్తి కలిగిన యువత ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు. రిజిస్ట్రేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు “జాయిన్ ఇండియన్ ఆర్మీ” వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ పరీక్షకు సంబంధించిన వివరాలు పొందు పరచడం జరిగిందన్నారు. అభ్యర్థులకు వచ్చే సందేహాలను నివృత్తి చేయడానికి ఇండియన్ ఆర్మీ వెబ్ సైట్ లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారన్నారు. ఆన్ లైన్ సి.ఈ.ఈ కి సంబంధించిన ప్రశ్నల కోసం మొబైల్ నెంబర్ ఆన్ లైన్ కు అందుబాటులో ఉందన్నారు. ఏప్రిల్ 17న వీటికి సంబంధించిన పరీక్ష జరుగుతుందని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఆర్మీ ఉద్యోగ అవకాశాలకు దరఖాస్తు చేసుకొని ఉద్యోగ అవకాశాలను పొందాలని సూచించారు. వచ్చే ఏడాది ప్రభుత్వం నిర్వహించే ఆర్మీ రిక్రూట్మెంట్ విధానం, పల్నాడు జిల్లా నుంచి అమలయ్యేలా కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని జిల్లా కలెక్టర్ వెల్లడించారు. సమావేశంలో ఆర్మీ కల్నల్ పునీత్ ఆర్మీ రిక్రూట్మెంట్ విధానం, రిజిస్ట్రేషన్, ఆన్లైన్ పరీక్ష, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, ఉద్యోగ నియామకం, ఉద్యోగంలో చేపట్టాల్సిన విధులు, విధానాలు, ఉద్యోగులకు కలిగే ప్రయోజనాలు తదితర అంశాలను మీడియాకు వివరించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి వినాయకం తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :