- మూడువేల ఐదువందల కేజీలు 236 మంది గిరిజనులకు బియ్యం పంపిణి
అనకాపల్లి జిల్లా, రావికమతం,ది రిపోర్టర్ : రావికమతం మండలం చీమలపాడు పంచాయతీ పరిధిలో జీసీసీ డిపో నెంబర్24లో 236 మంది గిరిజనులకు మార్చి,ఏప్రిల్ నెలలో సేల్స్ మెన్ బియ్యం ఇవ్వకుండా స్వాహా చేశాడని గిరిజనులతో కలసి సిపిఎం పార్టీ ఆందోళన చేయడం ఫలితంగా జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా జిసిసి సేల్స్ మెన్ పై క్రిమినల్ కేసు పెట్టి సస్పెండ్ చేశారు. మార్చి,ఏప్రిల్ నెల బియ్యాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి డీఎస్ఓని ఆదేశించి తక్షణమే బియ్యం పంపిణీ చేయాలని కలెక్టర్ ఆదేశాలతో నేడు జెడ్ జోగంపేట గ్రామంలో సివిల్ సప్లై డిటి,సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కే గోవిందరావు స్థానిక గిరిజనులకు పంపిణీ చేయడం జరిగింది.