కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల ఆశా వర్కర్లు సోమవారం హైదరాబాద్ కమిషనరేట్ కార్యాలయం ముందు ధర్నాకు వెళ్తుంటే గన్నేరువరం పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఫిక్స్డ్ వేతనాలు 18 వేల రూపాయలు ఇవ్వాలని. అదునపు పని భారం తగ్గించాలని. జీవిత బీమా కల్పించాలని. కరోనా లేప్రసి టిబి సర్వే పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎండి రజియా, పి మంగ, మంజుల, పుష్పలత, కవిత,డి రేణుక, విజయలక్ష్మి, కె పద్మ, కె సుజాత, సునీత, రేణుక, లావణ్య,శ్యామల, జి పద్మ లు పాల్గొన్నారు.