కర్నూల్ జిల్లా : సమాజానికి సందేశం ఇచ్చే పోలీసు.. తప్పతాగి రోడ్డు మీద పడిపోయాడు. ప్రజారక్షణే ధ్యేయంగా విధులు నిర్వహించాల్సిన ఖాకీనే.. కిక్కుతో కాలు కదలక తూలుతూ కింద పడిపోయాడు. ఇది చూసిన స్ధానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడంటే
కర్నూలులో ఓ ఏఎస్ఐ తాగిన మత్తులో హల్చల్ చేశాడు. యూనిఫాంలో ఉండి కర్నూలు నగరంలోని సెంట్రల్ ప్లాజా వద్ద.. మందు ఎక్కువై తూలుతూ దుకాణాల వద్ద కింద పడిపోయాడు. ఇది చూసిన స్థానికులు ఏఎస్ఐ దగ్గరికి వెళ్లి పట్టుకున్నారు. ఆ తర్వాత అక్కడి నుండి తీసుకెళ్లి రోడ్డు పక్కన వదిలేశారు.. ఖాకీ దుస్తుల్లో ఏఎస్ఐ ఫుల్లుగా మద్యం తాగి నడిరోడ్డుపైనే పడిపోవడం చూసి స్థానికులు విస్మయానికి గురయ్యారు. 3వ పట్టణ పోలీసులు సమాచారె తెలుసుకుని అక్కడకు చేరుకున్నారు. మద్యం మత్తులో ఉన్న ఏఎస్ఐని అక్కడినుంచి తీసుకెళ్లారు.