తనిఖీల్లో భాగంగా ట్రాఫిక్ పోలీసులు వాహనాలను ఆపడం సాధారణమైన విషయం. అలాగే, నిబంధనలు ఉల్లంఘించినవారి వాహనాలను కూడా నిలిపివేస్తారు. అయితే, హైదరాబాదులో ఓ వ్యక్తి తన బైక్ ను పోలీసులు ఆపడాన్ని భరించలేకపోయాడు. పోలీసులు ఆపారని తన బైక్ ను తానే తగలబెట్టుకున్నాడు.
రాంగ్ రూట్ లో వచ్చాడని పోలీసులు అతడి బైక్ ను ఆపారు. పోలీసులపై కోపంతో తన బైక్ పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అమీర్ పేట మైత్రీవనం వద్ద ఈ ఘటన జరిగింది. ఈ వ్యవహారం అక్కడున్న వారిని విస్మయానికి గురిచేసింది. కాగా, బైక్ ను తగలబెట్టిన వ్యక్తిని ఎల్లారెడ్డిగూడకు చెందిన అశోక్ గా గుర్తించారు