అల్లూరి జిల్లా -మారేడుమిల్లి: మారుమూల గ్రామాల్లో భాహ్య ప్రపంచానికి ఆమడ దూరంలో వున్న గిరిజనులతో రంపచోడవరం ASP పీ. జగదీష్ మమేకమయ్యారు. మంగళవారం ఆయన వై.రామవరం మండలం కానివాడ, గుర్తేడు పంచాయితీల పరిధిలో పర్యటించారు.గిరిజనుల స్థితిగతులు వారి జీవనాధారం, మావోయిస్టుల సంచారం పై అరాతీశారు. గిరిజనులు అనేక సమస్యలను ఏకరువు పెట్టారు. చిన్న చిన్న తగువులు గ్రామ పెద్దల సమక్షంలో సరిచేసుకోవాలన్నారు. మద్యానికి బానిసలై తగాదాలు సృష్టించు కోవొద్దన్నరు. యువత చెడు వ్యసనాలకు బానిసలు కావోద్దని సూచించారు. సమసమాజ అభివృద్ధికి యువతే కీలకమని ఆయన అన్నారు. మావోయిస్టుల కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయని, గిరిజనులు మావోయిస్టులను గ్రామాసరిహద్దుల్లోకి నిషేధించాలని సూచించారు. ముఖ్యంగా గంజాయి రవాణాలో స్మగ్లర్లు గిరిజనులను పావులుగా వాడుకుంటున్నారని గిరిజనులు ఇటువంటి రవాణాలో చేరి బలిపశువు కావద్దని హితవు పలికారు.ఈ కార్యక్రమంలో మారేడుమీల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ రమేష్, గుర్తేడు ఎస్ఐ జ్వాలా సాగర్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.