అల్లూరి జిల్లా : హుకుంపేట మండలం లోని గత్తుo పంచాయితీ, గాలిపాడు గ్రామానికి తారు రోడ్డు గ్రాంట్ చేయాలనీ డిమాండ్ చేస్తూ.. హుకుంపేట మండల పరిషత్ ,వైస్ ఎంపీపీ,సీపీఎం నాయకుడు సూడిపల్లి కొండలరావు తో కలిసి ప్రజలు,ఐటీడీఏ గ్రీవెన్స్ లో అల్లూరి జిల్లా కలెక్టర్ ,ఐటీడీఏ పీఓ ,అసిస్టెంట్ కలెక్టర్ లను కలిసి వినతిపత్రం అందించారు.స్పందించిన అధికారులు రెండు నెలల్లో పనులు ప్రారంభానికి చర్యలు చేపడతామని ,గిరిజన సంక్షేమ శాఖ ఇంజినీరింగ్ అధికారుల,సమక్షంలో తెలిపారు.ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ సూడిపల్లి కొండలరావు మాట్లాడుతూ తారు రోడ్డు లేకపోవడం తో,గ్రామంలో అంబులెన్స్,108 వంటి వాహనాలు రావడం లేదని ,అనేక సందర్భాల్లో గర్భిణీ స్త్రీలు మృత్యువాత పడుతున్నారని,తక్షణమే తారు రోడ్డు గ్రాంట్ చేయాలని డిమాండ్ చేశారు.రోడ్డు మంజూరు.చేయకుంటే పెద్ద ఎత్తున ఆందోళన లు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో పేటలి అప్పన్న,జన్ని బాలన్న,వళ్లాయి బాలన్న,జన్ని అప్పన్న,సీదరి వెంకటరావు, జన్ని లచ్చన్న, మహిళలు జన్ని నాగమణి,వళ్లాయి ఈశ్వరమ్మ,పార్వతమ్మ,రాములమ్మ,దేముడమ్మ,చిలకమ్మ,సీతమ్మ,రుక్మిణి,
యువకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
