ఆత్మకూరు డివిజన్ లెవెల్ స్పోర్ట్స్ ప్రోగ్రామ్ ను నెల్లూరు జిల్లా నెహ్రూ యువ కేంద్రం సహకారంతో ఆత్మకూరు రెవిన్యూ డివిజన్ స్థాయిలో గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ప్రోగ్రామ్ ను స్రేడ్ మరియు హెడ్స్ స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆత్మకూరు గవర్నమెంట్ హై స్కూల్ గ్రౌండ్ నందు ఉదయం 10:30 నుండి సాయంత్రం మూడు గంటల వరకు నిర్వహించారు. ఈ స్పోర్ట్స్ మీట్ లో వాలీబాల్, కోకో, రన్నింగ్ రేస్, షాట్ పుట్ మొదలైన ఈవెంట్స్ ని నిర్వహించామని తెలిపారు. ఈ స్పోర్ట్స్ మీట్ నిర్వహణకు నెల్లూరు జిల్లా నెహ్రూ యువ కేంద్ర యూత్ ఆఫీసర్ ఏ.మహేంద్రరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్బంగా ఈయన మాట్లాడుతూ జోనల్ పరిధిలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో చదువుకుంటున్న యువతి. యువకులకు ఆటలు మరియు గేమ్స్ పోటీలపై చైతన్య పరచడం వాళ్ళలో మెరుగైన ప్రతిభ కనపరిచిన విద్యార్థిని. విద్యార్థులకు జోనల్ స్థాయి నుండి డిస్టిక్ లెవెల్. మరియు స్టేట్ లెవెల్ వరకు నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో వారినీ అన్ని విధాలుగా ప్రోత్సహించి వారినీ స్పోర్ట్స్ మరియు ఫిజికల్ గా అభివృద్ధి చెందాలని పై కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని,అలాగే ప్రస్తుతం స్టూడెంట్స్ చెడు అలవాట్లకు వ్యసనాలకు బానిసలు కాకుండా ఆటలు పోటీలపై శ్రద్ధ ఉంచగలిగితే వారి కుటుంబాలు మంచి భవిష్యత్తుకు ఇస్తాయి అని పై కార్యక్రమాన్ని ఉద్దేశించి యూత్ ఆఫీసర్ తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా జిల్లా యువజన సర్వీసుల శాఖ సీఈవో ఎస్ శ్రీనివాసరావు మరియు సూపర్నెంట్ గయాజ్ హాజరయ్యారు. ఈరోజు ఈ సందర్భంగా హ్యూమన్ రైట్స్ డే కార్యక్రమాన్ని ప్రోగ్రాం అనంతరం నిర్వహించి వారికి మానవ హక్కుల విలువలు మరి ప్రజలకు ఉన్నటువంటి రైట్స్ గురించి అవగాహన కార్యక్రమాన్ని జూనియర్ కాలేజ్ క్యాంపస్ లో నిర్వహించడం జరిగింది. పై స్పోర్ట్స్ మీట్ లో వాలీబాల్ విన్నర్ టీం గా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ టీం గెలిచింది. అలాగే రన్నర్స్ టీమ్ గా శ్రీహరి టీం గెలిచింది. అలాగే కోకో పోటీలలో ఏ ఎస్ పేట మోడల్ జూనియర్ కాలేజ్ టీం గెలిచారు. అలాగే నందవరం మోడల్ జూనియర్ కాలేజ్ వారు రండర్స్ గా గెలిచారు. షాట్ పుట్ రన్నింగ్ రేస్ 100 మీటర్స్ షాట్ పుట్ ప్రోగ్రాం లో గవర్నమెంట్ జూనియర్ కాలేజీ స్టూడెంట్స్ ఫస్ట్ సెకండ్ ప్రైజులు దక్కించుకున్నారు. రన్నింగ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ లను గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అండ్ నందవరం జూనియర్ కాలేజ్ స్టూడెంట్స్ దక్కించుకున్నారు. పై ప్రోగ్రాంలో విన్నర్స్ టీంకు రన్నర్స్ టీంకు కప్స్ మెడల్స్ మెరిట్ సర్టిఫికెట్స్ షీల్డ్ అందజేయడం జరిగింది. పై ప్రోగ్రాంలో వాలీబాల్ విన్నర్ టీంకు జిల్లా యూత్ ఆఫీసర్ ఏ. మహేంద్రరెడ్డి ద్వారా వాలీబాల్ విన్నర్ కప్పును అందించడం జరిగింది. అలాగే షాట్ పుట్ రన్నింగ్ గేమ్స్ లో గెలిచిన వారికి సెట్నెల్ సీఈవో శ్రీనివాసరావు మరియు గవర్నమెంట్ హై స్కూల్ ఇన్చార్జి హెడ్మాస్టర్ విసి పెంచలయ్య అలాగే ఎస్ ఆర్ జే డి పీడి ఎస్. వెంకటేశ్వరరావు ఎన్జీవో సంస్థ ప్రతినిధులు టీచర్స్ కు అందజేయడం జరిగింది. ప్రోగ్రాం లో గవర్నమెంట్ హై స్కూల్ పి ఈ టి సిహెచ్ సురేష్ బాబు అలాగే మోడల్ నందవరం జూనియర్ కాలేజ్ పిఈటి అలాగే ఏఎస్ పేట మోడల్ జూనియర్ కాలేజీ పిఈటి అలాగే ఈ పై ప్రోగ్రాములను ఎస్ ఆర్ జే డి పీడి. ఎస్. వెంకటేశ్వరరావు మరియు ఈ టీం అందరూ కలిసి పై ఈవెంట్స్ ను మార్నింగ్ నుంచి సాయంత్రం మూడు గంటల వరకు నిర్వహించి విద్యార్థులకు బహుమతులు ఇవ్వడం జరిగింది. పై కార్యక్రమాన్ని సంస్థ ప్రతినిధులు వాగాల శ్రీహరి మరియు వి. వెంకటేశ్వర్లు ఏఎస్ పేట నిర్వహించడం జరిగింది. పై ప్రోగ్రాంలో నెహ్రూ యువ కేంద్రం ద్వారా ఆత్మకూరు లోనే యూత్ క్లబ్ సభ్యులకు బాల్ బ్యాట్మెంటన్ అలాగే నెట్ బాల్ కిట్టు చెస్ కిడ్స్ ను యూత్ ఆఫీసర్ అందజేయడం జరిగింది.