ఆత్మకూరు మండలం బోయిల చిరివెళ్ల సచివాలయం పరిధిలో గడప గడపకు వైసిపి ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. గడప గడప లో ఎమ్మెల్యే దృష్టికి వచ్చిన ప్రజా సమస్యలు ఎమ్మెల్యే సమీక్షా సమావేశంలో శాఖల వారి అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యలు త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా సచివాలయాల సిబ్బంది ద్వారా పరిష్కరించుకోవాలని సమావేశంలో తెలియజేసారు.