అనంతపురం గుత్తి మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో ఉంటూ పదవ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభను కనబరిచి ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు ఆదివారం గుత్తి మండల శ్రీకృష్ణదేవరాయ బలిజ సంఘం వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు అందజేయడం జరిగింది. వీరితో పాటుగా మండలంలో ఆరో తరగతి నుండి పదవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు ఉచితంగా నోటు పుస్తకాలు పెన్నులు పెన్సిల్ అందజేశారు. గుత్తి మండల సంఘం వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గుంతకల్లు నియోజకవర్గం ఎమ్మెల్యే సోదరులు గుమ్మనూరు నారాయణ హాజరయ్యారు. ఆయనతోపాటు దక్షిణ భారత కాపు బలిజ తెలగ సంఘం నాయకులు దాసరి రాము గుత్తి మండలం శ్రీకృష్ణదేవరాయ బలిజ సంఘం గౌరవాధ్యక్షులు పివీ. రమణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నియోజకవర్గ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సోదరుడు గుమ్మనూరు నారాయణ మాట్లాడుతూ గుత్తి మండల సంఘం వెల్ఫేర్ సొసైటీకి గుమ్మనూరు జయరాం కుటుంబం ఎప్పుడు అండగా ఉంటుందని భవిష్యత్తులో ఈ సంఘానికి ఎటువంటి సహాయ సహకారాలు అందించడానికైనా తమ సిద్ధంగా ఉంటామన్నారు. బలిజ సంఘం వెల్ఫేర్ సొసైటీ సభ్యులు అందిస్తున్న సహాయ సహకారాలు సద్వినియోగం చేసుకొని విద్యార్థిని విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థితి చేరుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సంఘం వెల్ఫేర్ సొసైటీ నాయకులు ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా హాజరైన గుమ్మనూరు నారాయణ దాసరి రాము లను దృశ్యాలు వాళ్ళు కప్పి పూలదండలతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో నాయకులు ఎంకే చౌదరి ఆముదాలగిరి అడ్వకేట్ సోము నాగరంగ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు