గతంలో టిడిపి ప్రభుత్వహయాంలో జూనియర్ కాలేజీలలో ఉన్నటువంటి మధ్యాహ్న భోజన పథకం.. విద్యాశాఖమంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ ఆదేశాలతో మళ్ళీ ఇప్పుడు రాష్ట్రంలో ఇంటర్ విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం క్రింద మధ్యాహ్నం పూట భోజన సదుపాయం కల్పించడం జరిగిందని అనంతపురము జిల్లా పార్టీ అధ్యక్షులు వెంకటశివుడు యాదవ్ గుంతకల్ నియోజకవర్గ శాసనసభ్యులు తనయుడు,సోదరుడు గుమ్మనూరు ఈశ్వర్ గుమ్మనూరు నారాయణ తెలిపారు. శనివారం అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో ఉన్నంటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దూర ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థులకు పేద విద్యార్థులకు ఈ పథకం ఈ పథకం ద్వారా పోషకాలు కలిగిన ఆహారాన్ని అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు కాబట్టి విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించి కుటుంబాలకు సమాజాని ఆదర్శప్రాయంగా తీర్చిదిద్దాలన్నారు ఈ కార్యక్రమంలో డీఈవో ప్రసాద్ బాబు; కళాశాల ప్రిన్సిపల్ మీనాక్షి మరియు సిబ్బంది తెలుగుదేశం పార్టీ నాయకులు పట్టణ మండల అధ్యక్షులు ఎంకే చౌదరి , బద్రి వలి, జక్కలచెరువు ప్రతాప్ చికెన్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు