అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం గుత్తి పట్టణం నందు వడ్డే ఓబన్న జయంతి సందర్భంగా స్థానిక ఎన్టీఆర్ సర్కిల్లో ఉన్న విగ్రహానికి తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు వెంకట శివుడు యాదవ్ పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటునే ప్రథమ స్వాతంత్ర్య యుద్ధం అంటారు. కానీ అంతకుముందే 1846లో తెలుగునాట ఉయ్యాలవాడ నరసింహ రెడ్డితో కలిసి బ్రిటిష్ వారి దౌర్జన్యాలకు వ్యతిరేకంగా తెలుగువారి ఆత్మగౌరవం నిలపడం కోసం వీరోచితంగా వడ్డేఓబన్న పోరాడాడు. ఆనాటి రేనాటి వీరుడు వడ్డే ఓబన్న చరిత్రను నేటి తరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఓబన్న జయంతిని అధికారింగా ప్రభుత్వం నిర్వహిస్తుంది . బీసీ ముద్దుబిడ్డ, స్వాతంత్య్ర సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతి సందర్భంగా ఆ మహనీయుని వీరగాథను స్మరించుకున్నారు.ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షుడు ఎంకే చౌదరి, జక్కలచెరువు ప్రతాప్ చికెన్ శ్రీనివాసులు , వడ్డెర సంఘం నాయకులు నరసింహులు, రాజు,చిరంజీవి, లక్ష్మీదేవి,హనుమంతు , చంద్ర, మరియు తెలుగుదేశం కార్యకర్తలు పాల్గొన్నారు.
